SRD: రాయికోడ్లోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలను ఎత్తివేస్తే ఉద్యమిస్తామని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాణిక్యం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్షేమ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. విద్యార్థులు లేరన్న సాకుతో కళాశాలలను ఎత్తివేసేందుకు ప్రయత్నిస్తుందని విమర్శించారు.