ATP: గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలో గురువారం భక్తి శ్రద్ధలతో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ జగదీశ్ ఆదేశాలతో ఆలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్త్ నిర్వహించారు. భక్తుల తాకిడికి అనుగుణంగా డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘావేసి పర్యవేక్షించారు.