KNR: తిమ్మాపూర్ మండలంలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో జ్యూట్ బ్యాగుల తయారీలో ఉచిత శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కేంద్ర జిల్లా మేనేజర్ సుధారాణి తెలిపారు. ఈ శిక్షణ జూన్ 1 నుంచి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. 18 నుంచి 45 ఏళ్లలోపు నిరుపేద, అనాథ, ఆర్థికంగా వెనుకబడిన మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చన్నారు.