VZM: నెల్లిమర్ల మండలంలోని కొత్తపేట గ్రామంలో శ్రీ మారుతీ యువజన సంఘం ఆధ్వర్యంలో హనుమాన్ జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై అన్న ప్రసాదం స్వీకరించారు.