HYD: కోవిడ్ విస్తరిస్తున్న నేపథ్యంలో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో 30 పడకలతో కోవిడ్ వార్డును ఏర్పాటు చేశారు. కోవిడ్ భయంతో అనవసరంగా ఆందోళనకు గురి కావొద్దని గాంధీ డిప్యూటీ సూపరింటెండెంట్ ప్రొ. సునీల్ కుమార్ పేర్కొన్నారు. కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు గాంధీలో ఏర్పాట్లు ప్రారంభించామని వివరించారు. ఓపీ భవనం రెండో అంతస్తులో వార్డ్ ఏర్పాటు చేశామన్నారు.