VZM: అర్హులకు సామాజిక పింఛన్లు మంజూరు చేయాలని సీపీఐ మండల కార్యదర్శి మొయిద పాపారావు, సీపీఎం మండల కార్యదర్శి కిలంపల్లి రామారావు డిమాండ్ చేశారు. ఈమేరకు నెల్లిమర్ల ఎంపీడీఓ సుదర్శనరావుకి గురువారం వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి అధికారం చేపట్టి ఎడాది గడుస్తున్నా అర్హులైన వితంతువులు, వృద్ధులు, వికలాంగులకు పింఛన్లు మంజూరు చేయలేదన్నారు.