మేడ్చల్: చర్లపల్లి డివిజన్లోని వీఆర్ కాలనీలో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను కార్పొరేటర్, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యురాలు బొంతు శ్రీదేవి పరిశీలించారు. 350 మీటర్ల సీసీ రోడ్డు పనుల్లో నాణ్యాతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. కాలనీ వాసులు అడిగిన వెంటనే స్పందిస్తూ పనులను పూర్తిచేయిస్తున్న కార్పొరేటర్‌కు కాలనీవాసులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.