దేశవ్యాప్తంగా 103 రైల్వేస్టేషన్లను ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించారు. అమృత్ భారత్ స్టేషన్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా రాజస్థాన్ స్టేషన్లో రైలుకు పచ్చ జెండా ఊపారు. మొత్తం 1300 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ పథకం కొనసాగుతోంది. ఆధునిక సౌకర్యాలు, మెరుగైన ప్రయాణ అనుభవం, స్థానిక సంస్కృతికి అద్దం పట్టేలా ఈ స్టేషన్లను రూపొందించారు.