NRPT: ధన్వాడ మండలం మంత్రోనిపల్లిలో ఆదివారం సాయంత్రం పిడుగు పడి ఓ ఎద్దు మృతిచెందింది. గ్రామానికి చెందిన రైతు ఆంజనేయులు ఎద్దుపై సాయంత్రం ఈదురు గాలులతో వర్షం కురవడంతోపాటు ఉరుములు, మెరుపులకు పిడుగు పడింది. ఎద్దు విలువ సుమారు రూ.50 వేల వరకు ఉంటుందని రైతు ఆంజనేయులు తెలిపారు.