VSP: మధురవాడలో రూ.172 కోట్లతో నిర్మిస్తున్న యూనిటీ మాల్ నగరానికి మైలురాయిగా నిలుస్తుందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. 5 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ మాల్‌ను బుధవారం ఆయన పరిశీలించారు. అలాగే ఎండాడలో కాపు భవనానికి కేటాయించిన భూమిని కూడా సందర్శించి, త్వరలో భవన నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు.