SKLM: బూర్జ నారాయణపురం ఆనకట్ట ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ నందు వివిధ పనులు నిర్వహించుటకు రూ.34.63 లక్షల నిధులు ప్రభుత్వం మంజూరు చేసిందని స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ కార్యాలయం నుంచి బుధవారం ఒక ప్రకటన విడుదలైంది. కుడి ప్రధాన కాలువల పేరుకుపోయిన ఇసుక తొలగింపు, నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారిన నీటి మొక్కల తొలగింపు తదితర పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.