»Tsnpdcl Recruitment 2023 Notification For 100 Junior Assistant Posts
TSNPDCL రిక్రూట్మెంట్ 2023..100 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్
తెలంగాణలో ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (TSNPDCL)లో 100 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. వాటిలో జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు ఉన్నాయి. వీటికి అప్లై చేయాలంటే పూర్తి వివరాలను దిగువన చూడండి.
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. ఎందుకంటే నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్(TSNPDCL) నుంచి 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ ఆపరేటర్ల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ఈ పోస్టులకు అప్లై చేయాలంటే అభ్యర్థులు గుర్తింపు పొందిన సంస్థ/బోర్డు నుంచి సంబంధిత విభాగంలో B.A, B.Com, B.Sc, ఇంజనీరింగ్, గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ డిగ్రీని కలిగి ఉండాలి. దీంతోపాటు ఎమ్మెస్ ఆఫీస్ లో గుర్తింపు పొందిన సంస్థ నుంచి సర్టిఫికేట్ పొంది ఉండాలి.
ఇక దరఖాస్తు సమర్పణకు ప్రారంభ తేదీ ఏప్రిల్ 10, 2023 కాగా..దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ ఏప్రిల్ 29, 2023గా ప్రకటించారు. అభ్యర్థుల నుంచి దరఖాస్తు సమర్పణ ప్రాసెసింగ్ రుసుము రూ.200తోపాటు ఫారమ్ సమర్పణ ఫీజు రూ.120ని కూడా వసూలు చేయనున్నారు.
అర్హత గల అభ్యర్థులు అధికారిక TSNPDCL వెబ్ సైట్ https://tsnpdcl.in ద్వారా ఆన్లైన్ విధానంలో ఈ నోటిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ పోస్టులకు అప్లై చేయాలంటే ఉద్యోగార్థులకు కనీస వయస్సు 01 జనవరి 2023 నాటికి 18 సంవత్సరాలు ఉండాలి. గరిష్ట వయోపరిమితి 44 సంవత్సరాలుగా ప్రకటంచారు. ఇక ఈ పోస్టులకు ఎంపికైన జూనియర్ అసిస్టెంట్ ఆపరేటర్ పోస్టులకు జీతం రూ. 29255-54380గా నిర్ధారించారు.