NRML: భూ భారతి కార్యక్రమంలో భాగంగా కుంటాల మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఎంపిక చేసిందని తహసీల్దార్ కమల్ సింగ్ పేర్కొన్నారు. రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేసుకోని వారి కోసం తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లో 35మంది రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీటీ నరేశ్ గౌడ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.