GNTR: భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మంగళగిరిలో ముస్లిం సోదరులు జోహార్ నమాజ్ దువా చేపట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలతో మంగళవారం ఆర్ఆర్ కన్వెన్షన్ హాల్లో ఈ ప్రార్థన కార్యక్రమం జరిగింది. భారత సైనికులకు దైవ బలం చేకూరాలని, వీరమరణం పొందిన సైనికుల ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్థించారు.