NLR: కొడవలూరు మండలంలోని గువ్వగుంట గ్రామంలో మంగళవారం కిశోరి వికాసం పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు బాలల హక్కుల పై అవగాహన కల్పించారు. ప్రతి సంవత్సరం నవంబర్ 14వ తేదీన నెహ్రూ జన్మదినం సందర్భంగా బాలల దినోత్సవం జరుపుకుంటామని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ నాగభూషణమ్మ పాల్గొన్నారు.