వాణిజ్య ఉద్రిక్తతల వేళ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తనకు ఫోన్ చేశారంటూ ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. తాజాగా దీన్ని చైనా ఖండించింది. ట్రంప్‌తో జిన్‌పింగ్ ఫోన్లో ఎటువంటి సంభాషణ జరపలేదని స్పష్టం చేసింది. సుంకాల వ్యవహారంలో ఇరుదేశాలు ప్రస్తుతానికి ఎటువంటి సంప్రదింపులు జరపడం లేదని వెల్లడించింది.