»Riots In Bihar Srirama Navami One Person Dead 80 Memebers Arrested
Riots: బీహార్ లో అల్లర్లు ..ఒకరి మృతి, 80 మంది అరెస్టు
బీహార్(Bihar)లోని నలంద, షరీఫ్‌లోని రెండు మూడు చోట్ల శనివారం రాత్రి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ఒక వ్యక్తి మృతి చెందగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి. మరోవైపు ఈ ఘటనలో మతపరమైన కోణం లేదని బీహార్ పోలీసులు చెప్పారు.
శ్రీరామనవమి వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో బీహార్(Bihar)లో నిన్న రోహ్తాస్, నలంద జిల్లాల్లో అల్లర్లు చేలరేగాయి. నలందలోని బీహార్ షరీఫ్ పరిధిలో నిన్న సాయంత్రం రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. రోహ్తాస్ జిల్లా ససారమ్ పట్టణంలో జరిగిన పేలుడులో మరో ఆరుగురికి గాయాలయ్యాయి. అయితే బీహార్‌లో శ్రీరామనవమి వేడుకల నేపథ్యంలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మోహిరించిన పోలీసులు గత రాత్రి 80 మందిని అరెస్టు చేశారు.
మరోవైపు పుకార్లు లేదా తప్పుడు వార్తలను నమ్మోద్దని, శాంతి భద్రతలను కాపాడేందుకు సహరించాలని నలంద పోలీసు(police) సూపరింటెండెంట్ అశోక్ మిశ్రా స్థానికులకు విజ్ఞప్తి చేశారు. ఇవి మత ఘర్షణలు కాదని ప్రాథమికంగా అంచనా వేశారు. మార్చి 31న కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీహార్ పర్యటన సందర్భంగా నలందలోని బీహార్షరీఫ్, రోహ్తాస్ జిల్లాలోని ససారంలో ఘర్షణలు చోటుచేసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
నలందలో సెక్షన్ 144 నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM), బీహార్షరీఫ్ సదర్, అభిషేక్ పలాసి తెలిపారు. మరోవైపు బీహార్ షరీఫ్‌లో శాంతిభద్రతల పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుందని వెల్లడించారు. ఈ క్రమంలో పుకార్లు లేదా తప్పుదోవ పట్టించే వార్తలను ప్రచారం చేయోద్దని ప్రజలను కోరారు. ఒకవేళ అలాంటి చర్యలకు పాల్పడితే వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ససారం, బీహార్ షరీఫ్లలో రామనవమి ఉత్సవాల సందర్భంగా జరిగిన ఉద్రిక్తతలు కలవరపెడుతున్నాయి. ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు ఇదే తొలిసారి. ఇది సహజమైనది కాదు. రాష్ట్రంలో మత సామరస్యానికి విఘాతం కలిగించేందుకు కొందరు వ్యక్తులు “గద్బాద్” (అపచారం)లో మునిగి తేలుతున్నారని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్(nitish kumar) అన్నారు. మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా బీహార్ ఎందుకు వస్తున్నాడో తనకు తెలియదని, ఎందుకు రాకూడదని నిర్ణయించుకున్నాడో అర్థం కాలేదని ఎద్దేవా చేశారు.