Akp: రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ నేరేడుబంద పీవీటీజీ గిరిజన గ్రామంలో జ్వరాలు విజృంభించాయి. గ్రామంలో 14 కుటుంబాలు జీవిస్తుండగా మూడు రోజుల నుంచి జ్వరాలతో 13 మంది చిన్నారులు బాధపడుతున్నారని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కే.గోవిందరావు తెలిపారు. తక్షణమే గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.