MHBD: కంబాలపల్లి గ్రామంలోని కాకతీయుల నిర్మిత శివాలయంపై శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తులు డ్రిల్స్‌తో ధ్వంసం చేసేందుకు యత్నించారు. శనివారం ఉదయం ఆలయం తెరిచేందుకు వెళ్లిన అర్చకులు గోడలపై డ్రిల్స్ గుర్తించి గ్రామస్తులకు తెలిపారు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు ఘటనపై విచారణ ప్రారంభించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.