VSP: పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో అంతర్ జిల్లా దొంగను మంగళవారం పోలీస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ దీప్తి మాధురి మాట్లాడుతూ.. అంపోలు కిషోర్ కుమార్ అనే వ్యక్తి నగరంలో బైక్లు దొంగతనం చేసి ఒడిశాలో అమ్మకాలు జరుపుతున్నాడని పేర్కొన్నారు. ఈ మేరకు అతనిపై నిఘాపెట్టి కిషోర్ని అరెస్ట్ చేశామని తెలిపారు.