అనకాపల్లి: ఈ నెల 19న మాడుగుల మండల సర్వసభ్య సమావేశం జరగనుందని ఎంపీడీఓ అప్పారావు తెలిపారు. ఉదయం 10 గంటలకు ఎంపీడీఓ కార్యాలయ మందిరంలో ఎంపీపీ తాళపురెడ్డి వెంకట రాజారామ్ అధ్యక్షతన ఈ సర్వసభ్య సమావేశం జరగనుందన్నారు. ఈ సమావేశానికి మండలంలోని సర్పంచ్ లు, ఎంపీటీసీలతో పాటు మండల స్థాయి అధికారులు పూర్తి సమాచారంతో హాజరుకావాలని కోరారు.