అనకాపల్లి: మాకవరపాలెం మండలం చామంతిపురం పంచాయతీ వెంకటాపురం గ్రామంలో శ్రీఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేశ్, తదితర నాయకులు హాజరై ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం మొక్కలు నాటారు.