కోనసీమ: నేటి నుంచి జిల్లాలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఈ వేసవిలో వేల సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. బుధవారం నుంచి జూన్ 8 వరకు పెళ్లి ముహూర్తాలే ముహూర్తాలు. జూన్ 11 నుంచి జూలై 12 వరకు ఆషాఢమాసంలో ముహూర్తాలు లేవు. మళ్లీ జూలై 25 నుంచి శ్రావణమాసంలో శుభ ఘడియలు ఉన్నాయి. దింతో వివాహ వేడుకలకు అంతా సిద్ధం అవుతున్నారు.