కాంగ్రెస్ ధర్నాలకు BJP నేత రవిశంకర్ ప్రసాద్ కౌంటర్ ఇచ్చారు. ‘నేషనల్ హెరాల్డ్ కేసులో చట్టం తన పని తాను చేస్తోంది. రూ.వేల కోట్ల విలువైన ప్రాపర్టీలని కుట్ర చేసి చట్టవిరుద్ధంగా కబ్జాకు ప్రయత్నించటం సరైందేనా? కాంగ్రెస్ నేతలు కోర్టులను కూడా గౌరవించటం లేదు. ఆ పార్టీ ధర్నాలు చేపట్టటం కాదు.. దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. అవినీతికి ప్రతీకగా కాంగ్రెస్ మారింది’ అని ఆరోపించారు.