WGL: గీసుగొండ మండలం నందనాయక్ తండాకు చెందిన ఓ యువతిపై అదే తండాకు చెందిన బదావత్ రవి సోమవారం లైంగిక దాడి చేయబోయినట్లు సీఐ మహేందర్ తెలిపారు. సీఐ మాట్లాడుతూ.. విషయం తెలుసుకున్న యవతి కుటుంబ సభ్యులు రవి, అతడి భార్య, తల్లిపై దాడి చేశారు. ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేశారని ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.