WGL: పట్టణ కేంద్రంలోని మడికొండ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ జయరాజుకు మంగళవారం సేవారత్న అవార్డు లభించింది. మనం ఫౌండేషన్ డాక్టర్ చక్రవర్తి ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జయరాజు రక్తదానం చేస్తూ, ప్రతి నెల ఒక బీద కుటుంబానికి సరిపడా బియ్యం అందిస్తున్నారు. ఆయన సేవలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు.