2020లో నవీ ముంబైకి చెందిన 15 ఏళ్ల బాలిక, UPకి చెందిన 22 ఏళ్ల యువకుడితో ఇంటి నుంచి వెళ్లిపోయింది. పది నెలల తర్వాత గర్భవతిగా ఇంటికి తిరిగి రావడంతో ఆమె తండ్రి.. యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు పెట్టారు. దీనిపై విచారణ జరిపిన బాంబే హైకోర్టు.. బాలిక తన ఇష్టపూర్వకంగానే వెళ్లిందని, పరిణామాలు తెలిసే ఆమె అలా చేసిందని పేర్కొంటూ యువకుడికి బెయిల్ మంజూరు చేసింది.