TG: రైతుల మేలు కోసమే భూభారతి చట్టాన్ని తీసుకువచ్చినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తెలిపారు. ‘రాష్ట్రంలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. పార్టీలు, మతాలు, కులాలకు అతీతంగా ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించాం. అర్హులైన అందరికీ సన్నబియ్యం అందిస్తున్నాం. ఎస్సీ వర్గీకరణపై జీవో విడుదల చేశాం. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతిచ్చారు’ అని అన్నారు.