KDP: జమ్మలమడుగు రూరల్ పరిధిలోని తలమంచిపట్నం పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉమెన్ హెల్ప్ డెస్క్ పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెండింగ్ కేసులను త్వరగా విచారించి పరిష్కరించాలన్నారు. రికార్డులు అప్డేట్ చేసుకోవాలన్నారు.