ప్రకాశం: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా శుక్రవారం మండల పరిషత్ కార్యాలయం నందు ఆడిట్ జరుగుతుందని ఏపీవో కోటేశ్వరి గురువారం తెలిపారు. 1-4-2023 నుండి 31-03-2024 వరకు జరిగిన పనులపై సామాజిక బృందం ఆయా గ్రామ పంచాయతీల నందు తనిఖీలు జరిగినట్లు ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ సర్పంచ్ మరియు ఉపాధి కూలీలు పాల్గొనాలని ఆమె కోరారు.