VSP: విశాఖలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో 69 రోజులకు అనగా బుధవారం హుండీలను లెక్కించారు. రూ.46,53,301 బంగారం 84.9 గ్రాములు, వెండి 795 గ్రాములు, విదేశీ కరెన్సీ లభించింది. హుండీల లెక్కింపు కార్యక్రమంలో ఉపకమిషనరు కార్యనిర్వాహణాధికారిణి కే.శోభారాణి, దేవదాయ శాఖ సహాయ కమీషనర్ టీ.అన్నపూర్ణ పాల్గొన్నారు.