మునుగోడు ఎన్నిక(Munugode by election) మరో వారం రోజుల్లో జరగనుంది. ఈ నేపథ్యంలో… ఈ ఎన్నికకు సంబంధించి ఎన్నికల ప్రచారం రేపటితో ముగియనుంది. దీంతో చివరి రోజైన రేపు…. అన్ని పార్టీల నేతలు ప్రచారాలు హోరెత్తించనున్నారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులు రేపు మునుగోడులోని నిర్వహించే రోడ్ షోలో పాల్గోనున్నారు. కలిసి ప్రచారం చేయనున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు ఎన్నిక ప్రచార గడువు ముగియనుంది. గత మూడు నెలలుగా జరుగుతున్న ప్రచారానికి తెరపడనుంది.
మునుగోడు సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగస్టు 3వ తేదీన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కొంత కాలం తర్వాత బీజేపీలో చేరారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం అయింది.
ఎన్నికల సంఘం మునుగోడు ఉప ఎన్నికల షెడ్యూల్‌ను అక్టోబర్ 3న విడుదల చేసింది. నవంబర్ 3న మునుగోడు ఉప ఎన్నికలు జరుగుతాయని వెల్లడించింది. నవంబర్ 6న ఫలితాలు వెల్లడిస్తామని ఈసీ స్పష్టం చేసింది. అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 14 వరకు నామినేషన్లు స్వీకరణ కార్యక్రమం జరిగింది.
బీజేపీ తరపున రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ తరపున పాల్వాయి స్రవంతి రంగంలో దిగారు. టీఆర్ఎస్ తరపున ప్రభాకర్‌రెడ్డిని పోటీలో దించారు.