CM Jagan ఇచ్చేది చాక్లెట్.. తీసుకెళ్లెది నక్లెస్: కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు
CM Jagan:ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్పై (jagan) టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ (Kanna laxminarayana) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన ఇచ్చేది చాక్లెట్.. తీసుకెళ్లేది నక్లెస్ అని మండిపడ్డారు. జగన్ సంక్షేమ కార్యక్రమం అంతా బూటకమని విమర్శించారు.
CM Jagan:ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్పై (jagan) టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ (Kanna laxminarayana) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన ఇచ్చేది చాక్లెట్.. తీసుకెళ్లేది నక్లెస్ అని మండిపడ్డారు. జగన్ సంక్షేమ కార్యక్రమం అంతా బూటకమని విమర్శించారు. వైసీపీ కార్యకర్తలు నాలుగేళ్లలో అసంతృప్తితో ఇళ్లకు పరిమితం అయ్యారని గుర్తుచేశారు. పోలీసులు (police) మాత్రం కార్యకర్తల కన్నా ఎక్కువ ఉత్సాహం చూపుతున్నారని మండిపడ్డారు. జగన్ను (jagan) రాష్ట్ర ప్రజలు తరిమికొట్టే రోజు వస్తోందని చెప్పారు. చంద్రబాబు నాయుడు (chandrababu) నాయకత్వంలో అమరావతి అభివృద్ధి చెందుతుందని కన్నా (Kanna laxminarayana) తెలిపారు.
అమరావతి రాజధానిపై అన్ని పార్టీలు సానుకూలంగా ఉన్నాయని కన్నా (Kanna laxminarayana) పేర్కొన్నారు. ఒక్క వైసీపీకే ఎక్కడ లేని అభ్యంతరాలు ఉన్నాయని చెప్పారు. ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన జగన్ (jagan).. రాష్ట్ర భవిష్యత్తును కట్ట కట్టి కృష్ణాలో పారేశారని మండిపడ్డారు. సీఎం జగన్కు (jagan) మూడు రాజధానులు కట్టాలని లేదని స్పష్టంచేశారు. దేశంలో అత్యంత ధనిక నేత కావాలని మాత్రం అనుకుంటున్నాడని విమర్శించారు. అందుకు ఉదహరణగా ఇసుక పాలసీ, రాజధాని అంశం నిలుస్తాయని చెప్పుకొచ్చారు.
అమరావతి రాజధాని కోసం రైతులు చేపట్టిన ఉద్యమం 1,200వ రోజుకు చేరుకుంది. మందడంలో రైతుల దీక్షా శిబిరానికి కన్నా లక్ష్మీనారాయణ (Kanna laxminarayana) చేరుకున్నారు. వారు చేస్తోన్న ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. విశాఖ (vizag) వడ్డించిన విస్తరిలా ఉందని, దోచుకోవడానికే రాజధాని అంటున్నారని కన్నా లక్ష్మీనారాయణ (Kanna laxminarayana) ఆరోపించారు. కన్నా లక్ష్మీనారాయణ (Kanna laxminarayana) ఇటీవల టీడీపీలో (tdp) చేరిన సంగతి తెలిసిందే. అంతకుముందు బీజేపీలో (bjp) ఉన్నారు. పార్టీ నేతలతో విభేదాలతో బయటకు వచ్చారు. కన్నాకు (Kanna laxminarayana) తగిన ప్రాధాన్యం ఇస్తామని.. చంద్రబాబు (chandrababu) చెప్పారు.