AP: తోటపల్లి ఆధునీకరణపై అసెంబ్లీలో పాలకొండ ఎమ్మెల్యే జయకృష్ణ ప్రశ్న లేవనెత్తారు. దీనికి మంత్రి నిమ్మల సమాధానమిచ్చారు. తోటపల్లి ఆధునీకరణ పనులు 25 శాతంలోపే పూర్తి అయినట్లు తెలిపారు. వైసీపీ హయాంలో పనులు జరగలేదని వెల్లడించారు. 2018 నాటి ధరల ప్రకారం గుత్తేదారులు పనులు చేయడం లేదన్నారు. సవరించిన అంచనాలతో కొత్త టెండర్లు పిలుస్తామని మంత్రి వెల్లడించారు.