WGL: వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ బుధవారం కాకతీయ యూనివర్సిటీ వీసీ కర్నాటి ప్రతాపరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీపీ, వీసీకి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యా రంగం, శాంతి భద్రతలు వంటి పలు అంశాలపై వీరు చర్చించారు. సమావేశంలో విశ్వవిద్యాలయం సంబంధిత అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.