KRNL: ఎమ్మిగనూరులో DSP భార్గవి ఆధ్వర్యంలో బుధవారం రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడపడం ప్రాణాంతకమని, హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించడం తప్పనిసరి అని ఆమె సూచించారు. అతి వేగాన్ని నియంత్రిస్తూ ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ, ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు.