కడప: నగరంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను నగరపాలక కమిషనర్ మనోజ్ రెడ్డి బుధవారం పరిశీలించారు. మార్నింగ్ విసిట్లో భాగంగా మారుతి నగర్, సెవెన్ రోడ్స్, కోపరేటివ్ కాలనీ ప్రాంతాలను సానిటేషన్ విభాగ అధికారులతో కలిసి పారిశుద్ధ పనులను పరిశీలించారు. ఓల్డ్ రిమ్స్ నందు మున్సిపల్ స్థలమును టౌన్ ప్లానింగ్ విభాగ అధికారులు, ఇంజనీరింగ్ విభాగ అధికారులతో పరిశీలించారు.