SDPT: గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామానికి దినేశ్ మొదటి ప్రయత్నంలోనే గ్రూప్-3లో మెరిశాడు. కాగా దినేశ్ తండ్రి 2020లో అనారోగ్యంతో మృతి చెందాడు. ఆ తర్వాత మూడు నెలలకే తల్లి రోడ్డు ప్రమాదంలో గాయాపడ్డి కోమాలోకి వెళ్లి మంచానికే పరిమితమైంది. అయినప్పటికీ కష్టపడి దినేశ్ కేవలం ఆన్లైన్ క్లాసులు మాత్రమే వింటూ.. అమ్మను చూసుకుంటూ గ్రూప్-3లో 80వ ర్యాంకు సాధించాడు.