BDK: భద్రాచలం డివిజన్లో తునికాకు సేకరణ టెండర్లు ఖరారు చేయాలని ఆదివాసీ సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నేత ముసలి సతీష్ అన్నారు. చర్ల సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. 2024 డిసెంబర్ నెలలోనే టెండర్లను పూర్తి చేసి కొమ్మకొట్టుడు పనులు పూర్తి చేయాలన్నారు. కానీ 2025 మార్చి వచ్చినా టెండర్ల ప్రక్రియ పూర్తి కాలేదన్నారు.