NLG: ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ ప్రశ్న పత్రాలను ఆదివారం దేవరకొండలో విడుదల చేశారు. అనంతరం ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా ఉపాధ్యక్షుడు బుడిగ వెంకటేష్ మాట్లాడుతూ.. పదో తరగతి విద్యార్థులు మొదటిసారిగా కామన్ పరీక్షలు రాయడానికి సిద్ధమవుతున్న తరుణంలో విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు, భయం పోవడానికి ఈ పరీక్ష ఉపయోగకరమన్నారు.