ATP: జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఇవాళ మధ్యాహ్నం సమయంలో అనంతపురంలో ఏకంగా 36°C, పుట్టపర్తిలో 34°C నమోదైంది. ఎండలకు మధ్యాహ్నం వేళ జనాలు బయటకు రావాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. మార్చిలోనే ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకావం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.