NLG: దేవరకొండ ఆర్టీసీ డిపో కండక్టర్ జమీరుద్దీన్ బస్సులో ఓ మహిళ ప్రయాణికురాలు మర్చిపోయిన బ్యాగును డిపోలో అందజేసి నిజాయితీ చాటుకున్నారు. దేవరకొండ నుంచి హైదరాబాద్ వెళుతున్న బస్సులో మహిళా ప్రయాణికురాలు పెళ్లి బట్టల బ్యాగును మర్చిపోయి దిగిపోయిందని కండక్టర్ గమనించి తిరిగి దేవరకొండకు తీసుకొచ్చి డిపోలో అందజేశారు.. విచారణ జరిపి బాధితురాలికి అప్పగించారు.