కృష్ణా: ఉంగుటూరు మండలం పెద్ద అవుటపల్లి ZPH స్కూలులో విద్యార్థులతో పనిచేయిస్తున్న వైనం బయటపడింది. ముండుటెండలో కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా విద్యార్థులతో తాపీ పని చేయించడంపై పలువురు మండిపడుతున్నారు. చదువుకునే బాలలతో పనిచేయిస్తున్న పాఠశాల HM, డ్రిల్ మాస్టారుపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు.