ASR: డుంబ్రిగూడ మండలంలో పబ్లిక్ ఎక్కువగా వచ్చే ప్రదేశాలలో శిశువుకు పాలిచ్చే గదులు (ఫీడింగ్ రూమ్స్) కేటాయిస్తామని సీడీపీవో నీలిమ పేర్కొన్నారు. ఈ మేరకు చాపరాయి జలపాతం వద్ద ఫీడింగ్ రూమ్ ఏర్పాటు చేసి పోస్టర్ అంటించామని ఆదివారం తెలిపారు. సోమవారం MRO, MPDO, వెలుగు ఆఫీసులలో, పోతంగి సచివాలయంలో, డుంబ్రిగుడ, కిల్లోగుడ పీహెచ్సీలలో ఏర్పాటు చేస్తామన్నారు.