SRPT: కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు రఘు మృతి మీడియా రంగానికి తీరని లోటని పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలో ఇటీవల కాలంలో అనారోగ్యంతో మృతి చెందిన కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులు పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు.