SKLM: వజ్రపుకొత్తూరు మండలం బాతుపురం-పెదవంక గ్రామంలో వాటర్ పైప్ లీక్ అవడంతో వీధుల్లో నీరు నిండిపోయింది. దాదాపు 10 రోజులు అవుతున్న నేటికీ సమస్య పరిష్కారం కాలేదని అధికారులకు తెలియజేసిన పట్టించుకోవడంలేదని ప్రజలు వాపోతున్నారు. సంబంధిత మండల అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.