W.G: కాళ్ళ గ్రామంలో ఆదివారం ఉదయం రొయ్యలతో వెళ్తున్న కంటైనర్ లారీ ప్రమాదవశాత్తూ రుద్రాయకోడు మురుగు కాలువలోకి దూసుకెళ్ళింది. ఈ ఘటనలో డ్రైవర్ సహా ఎవ్వరికీ ప్రమాదం జరగలేదు. స్థానిక రైతులు, గ్రామస్తులు వెంటనే రెండు క్రేన్ల సహాయంతో లారీని పైకి తీసుకువచ్చారు. టైనర్ సీజ్ చేసి ఉండటంతో రొయ్యలు లారీలోనే సురక్షితంగా ఉన్నాయని రైతులు తెలిపారు.