TG: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో భాగంగా ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. పరీక్ష సమయానికి 15 నిమిషాల ముందే సెంటర్ల గేట్లు బంద్ చేయాలని తెలిపింది. ఉ.8:45 గంటలలోపు వచ్చిన విద్యార్థులను పరీక్షకు అనుమతించనున్నారు. ఈనెల 5 నుంచి 25వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉ.9 నుంచి మ.12 గంటల వరకు పరీక్ష జరగనుండగా.. పరీక్షలకు నిమిషం నిబంధన వర్తిస్తుందని అధికారులు తెలిపారు.