NLR: పొదలకూరు మండలం మహమ్మదాపురంలో దొడ్ల శేషారెడ్డి ఆధ్వర్యంలో CSR కింద నిర్మించిన దొడ్ల శంకరమ్మ హాస్టల్ బ్లాక్‌ను కలెక్టర్ సమక్షంలో ప్రభుత్వానికి అప్పగించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. విద్య, వైద్య రంగాలలో దొడ్ల కుటుంబం చేసిన సేవలను కొనియాడారు. ఈ పాఠశాలను జిల్లాలోనే ఓ ఆదర్శ పాఠశాలగా మార్చేందుకు అందరూ సహకరించాలన్నారు.