ప్రకాశం: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జిల్లా ప్రజలకు ఒంగోలు ఎంపీ శ్రీనివాసుల రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. శివరాత్రి రోజున భక్తి శ్రద్ధలతో శివనామం జపిస్తూ చేపట్టే ఉపవాస దీక్షలు, రాత్రి జాగరణ, పూజలు అభిషేకాలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతి ఒక్కరిలో ఆత్మశుద్దిని, పరివర్తనను కలిగిస్తాయని అన్నారు. ప్రజలు భక్తిశ్రద్ధలతో శివరాత్రి పండుగను జరుపుకోవాలన్నారు.